పర్లాకిమిడి: గజపతి జిల్లా ముఖ్యవిద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక జాతీయస్థాయి పురస్కారాన్ని సెప్టెంబర్ 2, 3 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో నైపా అవార్డును అందుకోనున్నారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడమే కాకుండా 2024–25, 25–26 విద్యా సంవంత్సరంలో రెండు దఫాలు 99 శాతం పైగా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఘనత గజపతి డీఈవో మయాధర్ సాహుకు తక్కింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్, అడ్మిన్‌ష్ట్రేషన్ (నైపా) ఒడిశా రాష్ట్రంలో పాఠశాల విద్యకు వినూత్న విధానాలు, సూపర్ 30, ‘ప్రయాస్’వంటి కార్యక్రమాలు ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం స్ఫూర్తిని పెంపొందించిన ఫలితంగా 90 శాతం పైగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థాయికి తెచ్చి గజపతి జిల్లాకు పేరు తెచ్చారు.


