ఖుర్దా డివిజన్‌లో పలు రైళ్ల రద్దు | - | Sakshi
Sakshi News home page

ఖుర్దా డివిజన్‌లో పలు రైళ్ల రద్దు

Aug 27 2026 1:36 AM | Updated on Aug 27 2026 1:36 AM

ఖుర్దా డివిజన్‌లో పలు రైళ్ల రద్దు పదంపూర్‌ మాజీ ఎమ్మెల్యే మృతి నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ● రక్షా బంధన్‌ ప్రత్యేకం

భువనేశ్వర్‌: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్‌ మండలం పరిధిలోని కెందువాపడ, భద్రక్‌, కటక్‌ మార్గంలో మూడో లైన్‌ పనులకు సంబంధించి కెందువాపడ స్టేషన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. దీనిలో భాగంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా నియంత్రించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29, 30 తేదీల్లో 68438 కటక్‌ – భద్రక్‌ మెమూ రైలు, 68437 భద్రక్‌ – కటక్‌ మెమూ రైలు సేవలు రద్దు చేయనున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో 68424 కటక్‌ – భద్రక్‌ మెమూ రైలు సేవలు జాజ్‌పూర్‌ కెందుఝొర్‌ రోడ్‌ వరకు పరిమితం చేస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో 68423 భద్రక్‌ నుంచి బయల్దేరాల్సిన కటక్‌ మెమూ రైలు జాజ్‌పూర్‌ కెందుఝొర్‌ రోడ్‌ నుంచి బయల్దేరుతుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు కెందుఝొర్‌ రోడ్‌ వరకు వెళ్లాల్సిన 18037 ఖరగ్‌పూర్‌ – జాజ్‌పూర్‌ కెందుఝొర్‌ రోడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు భద్రక్‌ వరకు పరిమితం చేస్తారు. ఈ నెల 28 నుంచి 30 వరకు జాజ్‌పూర్‌ కెందుఝొర్‌ రోడ్‌ నుంచి ఖరగ్‌పూర్‌ వెళ్లాల్సిన 18038 ఎక్స్‌ప్రెస్‌ రైలు భద్రక్‌ నుంచి బయల్దేరుతుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు 18021 ఖరగ్‌పూర్‌ – ఖుర్దా రోడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు భద్రక్‌ వరకు పరిమితం చేస్తారు. 18022 ఖుర్దా రోడ్‌ – ఖరగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 27 నుంచి 30 వరకు భద్రక్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరుతుంది. రైళ్ల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారం నేషనల్‌ ట్రైన్‌ ఎంకై ్వరీ సిస్టమ్‌ (ఎన్టీఈఎస్‌)లో అందుబాటు లో ఉంటుందని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది.

భువనేశ్వర్‌: సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, పదంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సత్య భూష ణ్‌ సాహు (73) కన్ను మూశారు. భువనేశ్వర్‌ లోని ఒక ప్రైవేట్‌ ఆస్ప త్రిలో చికిత్స పొందు తూ బుధవారం తుదిశ్వాస విడిచారు. సత్యభూషణ్‌ సాహు 1980, 1985, 2004లో పదంపూర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై ఒడిశా శాసన సభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా కీలక బాధ్యల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆయన అకాల మర ణం పదంపూర్‌ ప్రాంతంతో పాటు ఒడిశా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదఛాయలను నింపింది. స్థానికులు, వివిధ వర్గాల నాయకులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

భువనేశ్వర్‌: రక్షాబంధన్‌ పండగ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు. ఈ నెల 27వ తేదీన గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని అన్ని అమొ బస్సుల్లో మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించవచ్చని, సమగ్ర ప్రాంత పట్టణ రవాణా (సీఆర్‌యూటీ) తెలిపింది. ఈ ఏర్పాటు ప్రకారం భువనేశ్వర్‌, కటక్‌, పూరీ, రూర్కెలా, సంబల్‌పూర్‌, బరంపురం, కెందుఝర్‌లలో అమొ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లే దు. ఈ కార్యక్రమం వల్ల సుమారు లక్ష మంది మహిళా ప్రయాణికులు ప్రయోజనం పొందు తారని సీఆర్‌యూటీ అంచనా వేస్తోంది. 7 నగరాల్లో పనిచేస్తున్న అమొ బస్‌ నెట్‌వర్క్‌ అంతటా ఈ నెల 27వ తేదీ రోజంతా ఈ మహిళల కు ఉచిత ప్రయాణ పథకం వర్తిస్తుంది.

వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా కేంద్రంలోని గోనెలవారి వీధిలో నివసిస్తున్న తోలేటి మహేష్‌ (50) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ బుధవారం వెల్లడించారు. మహేష్‌ కార్పెంటర్‌గా పనిచేస్తూ భార్య రాజేశ్వరితో కలిసి గోనెలవారి వీధిలో నివసిస్తున్నాడు. భార్య రాజేశ్వరి రైతుబజారు సమీపంలోని ఒక టైలర్‌ షాపులో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలుండగా.. ఒకరికి వివాహమై తన భర్తతో కలసి హరిపురంలో నివసిస్తోంది. రెండో కుమార్తె సౌమ్య రిమ్స్‌ కళాశాలలో నర్సింగ్‌ చదువుతోంది. రెండు సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న మహేష్‌, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మంగళవారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఎదురింటివారు వచ్చి చనిపోయాడని నిర్ధారించారని, ఈ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని భార్య రాజేశ్వరి తెలపడంతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

గల్లంతైన రైతు ఆచూకీ లభ్యం

ఇచ్ఛాపురం రూరల్‌: మండలంలోని సైదాలపుట్టుగ గ్రామానికి చెందిన రైతు నారద గంగయ్య పొలం పనుల్లో భాగంగా మంగళవారం బాహుదానది దాటుతూ నది ఉద్ధృతకు గల్లంతైన విషయం తెలిసిందే. రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. అయితే బుధవారం ఉదయం బాహుదా నది ఒడ్డుకు మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గమనించి రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్‌ ఎస్‌ఐ ఆర్‌.జనార్థనరావు మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించి, శవ పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement