జయపురం : జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి గ్రీవెన్స్‌సెల్‌కు విశేష స్పందన లభించింది. 47 ఫిర్యాదులు రాగా అందులో 20 కమ్యూనిటీ, 27 వ్యక్తిగత ఫిర్యాదులు. కొరాపుట్ జిల్లా కలక్టర్ మనో జ్ సత్యవాన్ మహాజన్ హాజరై వినతులను పరిశీలించారు. అనంతరం మిషన్ శక్తి యోజనలో భా గంగా మహిళా స్వయం సహాయక గ్రూపునకు రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. దివ్యా ంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ, జయపురం సబ్ కలెక్టర్ జాదుమణి నాయిక్, జిల్లా అటవీ విభాగ అధికారి ప్రశాంత పటేల్, జిల్లా అభివృద్ధి విభాగ ప్రధాన అధికారి, జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అధికారి బేణుదర శబర, బొరిగుమ్మ సమితి బీడీఓ సుకాంత పట్నాయిక్ పాల్గొన్నారు.


