జయపురం: అతడు ఓ ఉపాధ్యాయుడు. కొరాపుట్ జిల్లా మారుమూల ప్రాంతాల్లో పని చేస్తూ.. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న నిరక్షరాస్యతను అర్థం చేసుకున్నాడు. అమాయకత్వం, నిజాయితీ వలన వారు దోపిడీకి గురవుతున్నారు. వారి పరిస్థితికి ప్రధాన కారణం నిరక్ష్యరాస్యత అని గ్రహించిన ఆ ఉపాద్యా యుడిని, విద్యా ఉన్నతికి అంకితమైన అతడి జీవితాన్ని సమాజానికి పరిచయం చేసేందుకు ఒక దర్శకుడు సినీమా తీశాడు. మారుమూల ఆదివాసీ గ్రా మాల్లో ఆ ఉపాధ్యాయుడు చేపట్టిన విద్యా వ్యాప్తి ఉద్యమంలో అనేక ప్రతికూల వాతావరణంలోనూ ఆదివాసీ పిల్లలకు వారి మాతృ భాషలో విద్యా బోధన చేస్తు వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచి, పరివర్తన తీసుకువస్తున్నారు. కొరాపుట్ జిల్లా ప్రకృతి, గ్రామీణ జీవనం, ఆ ప్రాంత సామాజిక పరిస్థితులు కథగా మలచి ఆదివాసీ పిల్లలకు విద్యను అందిస్తున్న ఆ ఉపాధ్యాయుడి జీవితాన్ని కథలో ప్రధానంగా ప్రస్థావిస్తూ ‘లంకాఘడ్’ సినీమా తీశారు. ఈ నెల 12వ తేదీన విడుదల చేసిన ఈ సినీమా ప్రిమియర్ షో బుధవారం జయపురంలో ప్రదర్శించారు. సినీ దర్శకుడు, కళాకారులు, నిర్మా త, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రము ఖ కళాకారులు పాల్గొన్నారు. లంకాఘడ్ టైటిల్‌తో తీసిన ఈ సినీమాను అందరూ ప్రశంసించారు. ఇది కేవలం సినీమా మాత్రమే కాదని, మారుమూల ఆదివాసీ ప్రాంతంలో విద్యా వెలుగులు నింపుతున్న ఒక ఉపాధ్యాయుని స్ఫూర్తిదాయక కథ అని కొనియాడారు. ఈ చిత్రానికి దర్శకుడు ఆనంద కుమార్ ఒక ప్రొఫెసర్ అయినా చిత్రంలో హీరోగా నటించి జీవం పోశారు. సుదేష్ణ పాత్రలో హీరోయిన్ జెన్హ ఒక వితంతు తల్లిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో జయకార్, భూమా టన్‌టన్, సోపాన్ సామంతరాయ్, తరణి, శుభం, నరేష్, తరుణ్, బాల నటి పద్మ, తదితరులు తమ త్రలకు జీవం పోసి ప్రేక్షకుల మన్నలను పొందారు.


