పాత్రికేయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పాత్రికేయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

పాత్రికేయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

జయపురం:

పాత్రికేయుల న్యాయమైన డిమాండ్ల సాధనకు సామూహిక పోరాటం అవసమని జయపురం ఎం. ఎల్‌.ఎ తారాప్రసాద్‌ బాహిణీపతి అన్నారు. స్థానిక అప్సర కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉత్కళ సంబాదిక సంఘ కొరాపుట్‌ జిల్లా వార్శిక సాధారణ పరిషత్‌ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కళ సంబాదిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బిభూతి భూషణ కర్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. బాహిణీపతి ప్రసంగిస్తూ.. సమాజానికి ఎనలేని సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు రక్షణ కరువైందన్నారు. పెన్షన్‌ సౌకర్యం కల్పించటం ఎంతో అవసరమన్నారు.హెల్త్‌ బీమా కేవలం రూ.5 లక్షలకు మాత్రం చేస్తున్నారని దీనిని రూ.15 లక్షలు చేయాలన్నారు. హెల్త్‌ బీమా పరిధిలోనికి జర్నలిస్టుల తల్లితండ్రులతోపాటు కుటుంబ సభ్యులందరినీ చేర్చాలన్నారు. రాష్ట్రంలో ఉన్న జరనలిస్టులందరూ రాష్ట్ర రాజధానిలో సామూహిక ఆందోళన జరపాలని అందుకు తాను పూర్తి మద్దతు ఇస్తానన్నారు. జర్నలిస్టులు నిజాతీగా, నిర్భయంగా పనిచేయాలన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలిపి ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిలా పనిచేసి సమాజ ఉన్నతికి, కొరాపుట్‌ జిల్లా అభివృద్ధిలో మమేకం కావాలన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధిలు నిజాయితీగా ప్రజా సేవకు కట్టుబడి పనిచేస్తే ప్రగతి అసాధ్యం అవుతుందన్నారు. గౌరవ అతిథులు భారతీయ వర్కింగ్‌ జర్నలిస్టు మహాసంఘ అధ్యక్షులు హేమంత తివారీ, సాధారణ కార్యదర్శి సిద్ధార్థ కలహంస మాట్లాడుతూ.. దేశంలో జర్నలిస్టుల సమస్యలపై జాతీయ మహాసంఘ్‌ జరుపుతున్న పోరాటాలు, పత్రికా రంగంలో ఎఐ ప్రభావంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఉత్కళ సంబాద సంఘ్‌ కొరాపుట్‌ జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సమావేశంలో ఉత్కళ సంబాదిక సంఘ్‌ సలహాదారులు దండకారణ్య పత్రిక సంపాదకులు బినోద్‌ మహాపాత్రో, అశిభక్త కొరాపుట్‌లో సీనియర్‌ పాత్రికేయులు సంఘ్‌ సలహాదారు వి.భాస్కరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నందపూర్‌ సమితిలో వేలాది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకునిగా పేరు గాంచిన జి.సత్యనారాయణకు ‘వృక్ష బంధు’ బిరుదుతో సన్మానించారు. పత్రికా రంగానికి ప్రశంసనీయ సేవలు అందిస్తున్న చిన్న పత్రికల జాతీయ సంఘ ఉపాధ్యక్షుడు బినోద్‌ మహాపాత్రోను సత్కరించారు. ఈ వార్శిక సభలో కొరాపుట్‌ జిల్లా నుంచే కాకుండా నవరంగపూర్‌, మల్కనగిరి జిల్లాల నుంచి అనేక మంది పాత్రికేయులు, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement