వలసలు అరికట్టాలని వినతి | - | Sakshi
Sakshi News home page

వలసలు అరికట్టాలని వినతి

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

వలసలు అరికట్టాలని వినతి నీట్‌ పీజీకి మూడు పరీక్ష కేంద్రాలు

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో వీబీజీ రామ్‌జీ (ఉపాధి) చట్టాన్ని అమలు చేసి వేతనదారుల వలసలు అరికట్టాలని, ఉద్యానవనాలు, వ్యవసాయ శాఖ అధికారుల నియామకం చేపట్టాలని, పర్లాకిమిడిలో కోల్డ్‌ స్టోరేజీని మరమ్మతులు చేయాలని కోరుతూ డిప్యూటీ డైరక్టర్‌ (ఉద్యానవనాలు) బోరెక్‌ ఉల్లాంగ్‌ అమ్మన్‌కు బీజేపీ కృషక్‌ మోర్చా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌ పాలో వినతిని అందజేశారు. గజపతి జిల్లాలో వ్యవసాయ శాఖ, ఉద్యానవనాల శాఖల్లో బ్లాక్‌ స్థా యి అధికారులు కొరత చూపించి కేంద్ర ఉపా ధి పథకం అమలు కావడం లేదని ప్రశాంత్‌కుమార్‌ పాలో అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ డైరెక్టర్‌ బోరెక్‌ ఉల్లాంగ్‌ అమ్మన్‌ను కలిసిన వారిలో బీజేపీ యువజన మోర్చా నాయకులు కోట్ల యువరాజ్‌, శాసనం లింగరా జు తదితరులు ఉన్నారు.

విద్యుత్‌ షాక్‌తో వెల్డర్‌ మృతి

నరసన్నపేట: మడపాం టోల్‌గేట్‌ వద్ద ఓ పరిశ్రమలో వెల్డింగ్‌ పనులు చేస్తున్న చేనులవలసకు చెందిన సరిపల్లి రామచంద్రరావు (35) విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. గతంలో వంశధార పేపరు మిల్లులో పనిచేసిన రామచంద్రరావు ప్రైవేటుగా వెల్డింగ్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ దశలో మంగళవారం పరిశ్రమలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. స్థానికులు స్పందించి నరసన్నపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు రామచంద్రరావు తల్లి మరణించగా తండ్రి అప్పన్న వృద్ధాప్యంలో ఉన్నారు. భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామచంద్రరావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

ఆమదాలవలస/బూర్జ: శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని తులగాపు శ్రీనివాస రావు(43) మృతి చెందినట్లు జి.ఆర్‌.పి. పోలీసులు తెలిపారు. బూర్జ మండలం లచ్చయ్యపే ట కాలనీకి చెందిన శ్రీనివాసరావు భార్య ర మ్య, ఇద్దరు పిల్లలు పూజిత, తరుణ్‌ ఉన్నారు. మద్యానికి బానిసై రెండురోజుక్రితం ఇంటి నుంచి వచ్చేశాడు. ఏం జరిగిందో గానీ రైలు కింద పడి మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

మనస్తాపంతో

యువతి ఆత్మహత్య

సంతబొమ్మాళి: గోవిందపురం గ్రామానికి చెందిన నీలాపు రమ్య(21) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదువుకున్న రమ్య పలుమార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమైంది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో దిగులు చెందుతూ గడ్డిమందు తాగడంతో రాగోలు జెమ్స్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రమ్య తల్లి మహాలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సంతబొమ్మాళి ఎస్సై వై.సింహాచలం మంగళవారం తెలిపారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఈ నెల 30న జరగనున్న నీట్‌ పీజీ–2026 పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఎచ్చెర్ల మండలంలోని శ్రీ శివాని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ చిలకపాలెం జంక్షన్‌లో 270, శ్రీ వేంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో 100, నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీస్‌లో 312 కలిపి మొత్తం 682 సీటింగ్‌ సామర్థ్యంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎస్పీ పర్యవేక్షణలో గట్టి భద్రతతో పాటు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్‌, నెట్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీవో సాయి ప్రత్యూష, వైద్య ఆరోగ్య, ఆర్టీసీ, పోలీసు శాఖల అధికారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement