సేవా దళాలకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

సేవా దళాలకు సన్మానం

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

సేవా దళాలకు సన్మానం

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడలో మంగళవారం రథ యాత్రపై క్‌లైమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్స్‌పై మంగళవారం సమావేశం నిర్వహించా రు. రథయాత్ర నిర్వహణలో ఎటువంటి ఫిర్యాదు లు, అభ్యంతరాలు ఉన్నా చెప్పాలని తహసీల్దార్‌ కోరారు. సభికులు రథయాత్ర ఘనంగా జరిగిందని ముక్త కంఠంతో వెల్లడించటంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం సమీక్ష సమావేశం రథ యాత్ర కమిటీ నిర్వహించింది. బొయిపరిగుడ సమితి సభాగృహంలో బొయిపరిగుడ తహసీల్దార్‌ స్నిగ్ద చౌదరి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో బొయిపరిగుడ సమితి బిడిఓ సుభ్రత సాహు, పోలీసు అధికారి లక్ష్మీనారాయణ ముదులి, రథ యాత్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రథయాత్ర ప్రశాంతంగా, అంగరంగ వైభవంగా జరిగిందని అందుకు స్థానిక సహిద్‌ లక్ష్మణ నాయక్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు, డ్రైవర్‌ మహా సంఘం, బొడయి సేవా సంఘ కార్యకర్తలు స్వచ్ఛందంగా అందించిన సేవలను కమిటీ కొనియాడింది. వారంతా ప్రశంసనీయమైన సేవలు అందించారని అధికారులు అభినందించా రు. రథయాత్రలో స్వచ్ఛందంగా సేవలు అందించి న వారిని అధికారులు ప్రశంసాపత్రాలు, మెమోంటోలు అందజేసి సన్మానించారు. ఈ సమావేశంలో రథయాత్ర సమయంలో చేపట్టిన ఏర్పాట్లు, భక్తుల కు సమకూర్చిన సౌకర్యాలు, సేవా కార్యక్రమాలపై సమీక్షించారు. భవిష్యత్‌లో రథయాత్ర వేడుకలను మరింత ఉత్సాహంగా, భక్తులకు ఏర్పాట్లను బలోపేతం చేయాలని కమిటీ నిర్ణయించింది. రథయా త్ర ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు, యువతకు పలు సంస్థల కార్యకర్తలకు కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement