పర్లాకిమిడి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పర్లాకిమిడి శివార్లలో ఉన్న మొక్కతోటమ్మ గుడి కాలనీ వద్ద ఎంఐ నాలా మురికినీరు కాలనీలోకి చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, పురపాలక సంఘం ఇంజినీర్లు, చైర్మన్ నిర్మలా శెఠి తదిత రులు మంగళవారం విచ్చేసి ప్రజలతో మాట్లాడా రు. కొత్తగా ఏర్పడిన కాలనీ పురపాలక సంఘం కింద రావడం లేదు. గుసాని సమితి కెరండీ పంచాయ తీ పరిధిలోకి వస్తుంది. అందువల్ల ఈ కాలనీకి వరదనీరు రాకుండా ఉండేందుకు ఆంధ్రాలోని పాతపట్నం మండలం పాసి గోపాలపురం నాలాకు కనెక్టు చేయాలని ఇంజినీర్లు సలహా ఇచ్చారు. ఎగువ నుంచి వరదనీరు కట్టడికి గార్డు వాల్ నిర్మించాల్సి ఉంటుందని కౌన్సిల్ ఇంజినీర్లు తెలియజేశారు. దీనిపై డీపీఆర్‌లు తయారుచేసి అర్బన్ డెవలప్‌మెంట్ నిధులు మంజూరు చేస్తే పనులు చేపడతామని ఇంజినీర్లు చెబుతున్నారు.


