దివ్యాంగ బాలల హక్కులను రక్షించాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ బాలల హక్కులను రక్షించాలి

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

దివ్యాంగ బాలల హక్కులను రక్షించాలి

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో దివ్యాంగ బాలల హక్కులు కాపాడటానికి వివిధ ఎన్జీఓలు, మెడికల్‌ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, చైల్డ్‌లైన్‌, శిశు సంక్షేమ శాఖ అధికారులకు కెపాసిటీ బిల్డింగ్‌ శిక్షణ కార్యక్ర మం కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం జిల్లా శిశు సురక్షా శాఖ, అరుణ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా సామాజిక సురక్షా అధికారి ఉత్సర్‌ గీతా బో డోరయితో అధ్యక్షత వహించారు. దివ్యాంగ స్వశక్తీకరణ ఉపఖండ అధికారి లక్కోజు సంతోష్‌ కుమా ర్‌, బిభూతీభూషణ్‌ నందో, డి.సి.పి.ఒ అరుణ్‌కు మార్‌ త్రిపాఠి, సంతోష్‌ బెహరా తదితరులు హాజరయ్యారు. దివ్యాంగ బాలలతో వెట్టిచాకిరీ చేయిస్తు న్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఓపెన్‌ లెర్నింగ్‌ పద్ధతి అధ్యక్షుడు సంతోష్‌ బెహరా అన్నారు. దివ్యాంగ బాలలకు పునరావాసం, బ్రెయిలీ విద్య కల్పించాలని అరుణ్‌ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ సాయి ప్రసాద్‌ సామల్‌ అన్నారు. ఈ శిక్షణ శిబిరంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి అమియా త్రిపాఠి, సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ కార్యదర్శి ఎ.జగన్నాథరాజు, వన్‌ స్టాప్‌ సెంటర్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement