రాయగడ: మారుమూల ప్రాంతాలకు చెందిన యువకుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో అవకాశాలు క ల్పించేందుకు వీలుగా ట్యాలెంట్ హంట్ కప్ బ్యా డ్మింటన్ ఎంపిక పరీక్షలను అసోసియేషన్ ప్రతినిధులు నిర్వహించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసొసియేషన్, ఒడిశా ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఎంపిక పోటీలు జరిగాయి. జిల్లాస్థాయి చాంపియన్‌షిప్‌కు క్రీడాకారులను ఎంపిక చేయడంతోపాటు జిల్లా నుంచి రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌కు ప్రతిభావంతులైనన క్రీడాకారులను గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలియజేశారు. స్థానిక అంబగుడలోని బిజుపట్నాయక్ ఇండొర్ స్టేడియం, రాయగడ సద్భావన ఇండొర్ స్టేడియం, గుడారి ఎంపీఐఎస్, గుణుపూర్ ఎంపీఐఎప్, జేకే క్లబ్, టికిరి దొరగుడ ఇండోర్ స్టేడియంలో ఎంపిక పరీక్షలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ బ్యాడ్మింటన్ ప్రతిభను ప్రదర్శించారు. ఈ ఎంపిక పరీక్షల్లో 200 మందికి పైగా బాలురు, 30 మందికి పైగా బాలికలు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులకు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లొ పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి రాయగడ అంబగుడలోని బిజుపట్నాయక్ ఇండొర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో రాయగడ జిల్లా బ్యాడ్మింటన్ అసొసియేషన్ అధ్యక్షుడు హిమాంశు శేఖర్ పాండియా, కార్యదర్శి సురేష్ చంద్ర పండ, మునా జైన్, జయరాం వర్మ, డి.మణికాంత్, సహదేవ్ బామణా, పంచానన్ సతపతి పాల్గొన్నారు.


