మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి టోనాల్ క్యాంప్ పంచాయతీలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా 62 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో కొన్నింటిని పరిశీలించి అక్కడిక్కక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ అప్పగించి క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, జిల్లా సబ్‌కలెక్టర్ దూరోధ్యన్ బోయి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.


