గ్రీవెన్స్‌ సెల్‌కు వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌ సెల్‌కు వినతుల వెల్లువ

Aug 25 2026 1:27 AM | Updated on Aug 25 2026 1:27 AM

గ్రీవెన్స్‌ సెల్‌కు వినతుల వెల్లువ

పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా బ్లాక్‌ కేంద్ర కా ర్యాలయంలో సోమవారం నిర్వహించిన జాయింట్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు ఏడీఎం మునీంద్ర హనగ హాజర య్యారు. మోహనా బ్లాక్‌లో మలాస్‌పదర్‌, చంద్రగిరి, మోహనా, అడవ గ్రామ పంచాయతీల నుంచి 90 వినతులు అధికారులు అందాయి. వీటిలో 24 వినతులు వ్యక్తిగతం, 66 వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించినవి ఉన్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధి కోం ఒక దరఖాస్తు అందింది. నిస్సహాయురాలికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఏడీఎం(రెవెన్యూ) మునీంద్ర హనగ అందజేశారు. అందిన వినతులు సకాలంలో పరిష్కారం చూపాలని ఏడీఎం మోహనా అదనపు బీడీఓకు ఆదేశించారు. మ లాస్‌ పదార్‌ పంచాయతీలో ఉన్న దెడేంగ్‌ జలపా తాలు, చుట్టు పక్కల ఉన్న పెకిలిగుడ, దెబ్బగుడ, కెహెలిగుడ, బంజమా గ్రామాలు అభివృద్ధి చేయాలని, వందేమాతరం జాతీయ దినోత్సవ వేడుకలు మోహనాలో జరపాలని, మోహనాలో కొందరు వినతిని అందజేశారు. ఈ గ్రీవెన్స్‌ సెల్‌కు సబ్‌ కలెక్టర్‌ అనూప్‌ పండా, సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి (ఆర్‌.ఉదయగిరి) రాకేష్‌ కుమార్‌ సాహు, ఇతర ప్రభుత్వ ఉన్నతాఽధికారులు విచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement