వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సులకు మాన్యువల్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సులకు మాన్యువల్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌

Aug 23 2026 12:34 AM | Updated on Aug 23 2026 12:34 AM

వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సులకు మాన్యువల్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌

ఆమదాలవలస: ప్రాంతీయ వ్యవసా య పరిశోధన స్థానం అనకాపల్లిలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లమా కోర్సు ల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 27వ తేదీన మాన్యువల్‌ స్పాట్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీపాన నీలవేణి తెలిపారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ పరిశోధన స్థానంలోగల ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ 2026 – 27 విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయం పరిధిలోని మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు జోనల్‌ స్థాయిలో స్పాట్‌ కౌన్సిలింగ్‌కు అనుమతి లభించిందని అన్నారు. నార్త్‌ కోస్టల్‌ జోన్‌కి సంబంధించిన కౌన్సిలింగ్‌ ఈ నెల 27వ తేదీ గురువారం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తొగ రాం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ప్రైవే టు వ్యవసాయ పాలిటెక్నిక్‌లో మిగిలిన సీట్లను ఈ కౌన్సిలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకుని సీటు పొందలేని వారు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. సందేహాల నివృత్తికి వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నంబర్‌ 77023 94824 కు సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement