● అంతర్జాతీయ వరి పరిశోధన
సంస్థతో ఒప్పందం
జయపురం: స్వదేశీ వరి విత్తన రకాలను ప్రోత్సహించేందుకు ఎం.ఎస్ స్వామినాథన్ రిసేర్చ్ కేంధ్రం జయపురం శాఖ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థతో శనివారం సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఉభయ సంస్థల మధ్య జరిగిన శాసీ్త్రయ ఒప్పందంపై స్వామినాథన్ రిసెర్చ్ సెంటర్, అంతర్జాతీయ రైస్ రిసెర్చ్ పరిశోధన కేంద్రం అధికారులు సంతకాలు చేశారు. జయపురం ఫూల్‌బెడ ప్రాంతంలోని ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ సెంటర్ సభాగృహంలో జరిగిన ఒప్పంద కార్యక్రమనంలో ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ విభాగ అధికారి, కుంధ్ర సమితి వ్యవసాయ విభాగ అధికారిలు అతిథులుగా హాజరయ్యారు. ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ సెంటర్ సీనియర్ అధికారులు, రైతులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అంతర్ జాతీయ రైస్ పరిశోధన కేంద్రం సాంకేతిక బృందం పాల్గొన్నారు. ఈ భాగస్వామ్య ఒప్పందం వలన కొరాపుట్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన స్వదేశీ వరి నల్లజీర (కళాజీర) తదితర సుగంధ పోషకాలతో కూడిన వరి రకాలకు ప్రోత్సాహం, వాణిజ్యకరణ దిశగా ముఖ్యమైన ముందడుగని స్వామినాథన్ కేంద్ర డైరెక్టర్ ప్రశాంత పొరిడ వెల్లడించారు. ఈ ఒప్పందం ఆదివాసీ మహిళా రైతులు, స్వయం సహాయక బృందాల జీవనోపాధి ఆదాయ పెంపునకు ఉపయోగ పడుతోందని వెల్లడించారు. అంతే కాకుండా ఈ ఒప్పందం వలన దేశీ వరి రకాలలో సచ్ఛమైన విత్తనాల ఎంపిక, గుర్తింపు, ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌తోపాటు రైతులను ప్రోత్సహించేందుకు దృష్టి పెట్టటం జరుగుతుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా సంప్రదాయ వరి రకాలకు మార్కెట్ అనుసంధాన్ని కూడా సులభతరం చేస్తుందన్నారు. ఇది మిషన్ శక్తి విభాగం పరిధిలోని మహిళా స్వయం సహాయక గ్రూపులకు, ఆదివాసీ రైతులకు ఎంతో మంచి లాభదాయకమన్నారు.


