అరసవల్లి: యూనియన్‌లో గత మరకలను పూర్తిగా తొలిగించేలా చర్యలు చేపట్టామని.. ఎలాంటి విబేధాలు అంతర్యుద్ధాలు లేకుండా సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ఆర్‌కే గణపతి పిలుపునిచ్చారు. శనివారం యూనియన్ గుర్తింపు చిహ్నమైన టవర్‌ను స్థానిక యూనియన్ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టవర్‌లా సంఘ సభ్యులంతా క్రమశిక్షణతో ఉంటే మంచిగా సేవ చేసే పవర్ అందిస్తుందని గుర్తుచేశా రు.కార్యక్రమంలో 1104 సంఘ డిస్కం వర్కింగ్ ప్రెసిడెంట్ మహంతి ప్రభాకరరావు, డిప్యూ టీ జనరల్ సెక్రటరీ రాజేశ్వరరావు, రీజనల్ అధ్యక్షుడు టి.వి.సుబ్రహ్మణ్యం, రీజనల్ ప్రధా న కార్యదర్శి ఎన్.లోకేశ్వరరావు, ట్రెజరర్ శ్రీధ ర్, విశాఖపట్నం రీజనల్ కార్యదర్శి నూక రా జు, శ్రీకాకుళం బ్రాంచ్ అధ్యక్షుడు వి.నారాయణరావు, ఉమ, సూర్యనారాయణ, అచ్చెన్నాయుడు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు రూరల్: డోకులపాడు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు దుమ్ము పాపమ్మ (102) శనివారం మృతి చెందారు. పాపమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈమె భర్త, ఇద్దరు కుమారులు కొంతకాలం క్రితమే చనిపోయారు. ప్రస్తుతం ఓ కుమారుడు, కుమార్తెతో పాటు మరో 15 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రకటించిన 2024–25 ఆర్థిక సంవత్సరపు వార్షిక పురస్కారాల్లో శ్రీకాకుళం జిల్లా రెండు కీలక అవార్డులను కై వసం చేసుకుంది. సభ్యత్వ నమోదు, నిధుల సేకరణ విభాగానికి గానూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎంపిక కాగా, పాత జిల్లాల విభాగంలో ఉత్తమ జిల్లా పురస్కారాల్లో ద్వితీయ స్థానానికి గానూ జాయింట్ కలెక్టర్, ఐఆర్‌సీఎస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఎంపికయ్యారు. సెప్టెంబరు 1న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న ఐఆర్‌సీఎస్ రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) రాష్ట్ర గవర్నర్, సొసైటీ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులను అందజేయనున్నారు. పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వ్యక్తిగత ఆహ్వాన పత్రికలను ఐఆర్‌సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఈఓ ఎ.కె.పరిడా జిల్లాకు పంపించారు.
కవిటి: దేశంలోనే ఏకై క భారత మాత దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన సీహెచ్ కపాసుకుద్ధి భారతమాత ఆలయం 22వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులంతా వేటకు విరామం ప్రకటించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో మహిళలు హాజరై సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఏకాహం భజన కాలక్షేపం నిర్వహించారు.


