పర్లాకిమిడి: బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో అండర్ 17 పోటీల్లో గజపతి జిల్లా కేంద్రియ విద్యాలయం విద్యార్థిని సువర్ణసాహు (పదో తరగతి) కాంస్యం సాధించినట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు బెంగళూరు ఎయిర్‌ఫోర్సు ఇండోర్ స్టేడియం కాంప్లెక్సులో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు 800 మంది పాల్గొన్నారు. గజపతి జిల్లా కేంద్రీయ విద్యాలయం విద్యార్థిని సువర్ణసాహు అండర్ 17 విభాగంలో 59 కిలోల వెయిట్ క్యాటగరీలో పాల్గొని కాంస్య పతకం సాధించినట్టు జిల్లా తైక్వాండో అకాడమీ కోచ్ కార్తీక్ మహాపాత్రో తెలియజేశారు. ఆమె విజయంపై గజపతి కేంద్రియ విద్యాలయం టీచర్లు, సిబ్బంది అభినందనలు తెలిపారు.


