చట్టాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన

Aug 19 2026 12:30 AM | Updated on Aug 19 2026 12:30 AM

పర్లాకిమిడి: స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా స్వశక్తీకరణ విభాగం ఆధ్వర్యంలో న్యాయ సచేతన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ శిబిరంలో మహిళా డిగ్రీ కళాశాల అధ్యక్షురాలు డాక్టర్‌ రీనా సాహు, డీఎస్‌డబ్ల్యూఓ సురక్షా అధికారి సరలా పాత్రో, ఓ.ఎల్‌.ఎం జిల్లా కో ఆర్డినేటర్‌ శివానీ పాణిగ్రాహి, జిల్లా మహిళా స్వశక్తీకరణ కో ఆర్డినేటర్‌ ఎల్‌.రాంప్రసాద్‌, ఒన్‌ స్టాప్‌సెంటర్‌ సునితా రోథో తదితరులు పాల్గొన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం అవలంబిస్తున్న వివిధ చట్టాలను సునీతా రోథో విద్యార్థులకు తెలియజేశారు. బాల్య వివాహాల రద్దు చట్టం, గృహాహింస చట్టాలను వివరించారు. 18 ఏళ్లు కంటే తక్కువ వయస్సు గల అమ్మాయిల విషయంలో భద్రతకు తగిన చర్యలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement