పర్లాకిమిడి: ఒడిశా విధానసభలో ‘కమిటీ పేపర్స్ లెయిడ్ ఆన్ టేబుల్’ నాలుగో సమావేశం (2026–27) మంగళవారం విధాన సభలో జరిగింది. ఈ సమావేశానికి పర్యాటక, రవాణా మంత్రులు, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హాజరయ్యారు. గజపతి జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న బృందావన్ ప్యాలస్ మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పర్లాకిమిడిలో నూతన బస్టాండ్ నిర్మాణానికి రూ.40 కోట్లు, కాశీనగర్ ఎన్.ఎ.సి.కి రూ.20 కోట్లు, గుసాని సమితిలో బస్టాండ్‌కు రూ.20 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కమిటీకి డిమాండ్ చేశారు. పర్లాకిమిడి–పూరీ–తిరుపతికి ఒడిశా ఆర్టీసీ ఏసీ బస్సులు వేయాలన్నారు.


