పర్లాకిమిడి: గజపతి జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా ఆదేశాల మేరకు ఆర్.ఉదయగిరి పోలీసు స్టేషన్ అధికారులు సుందర్‌డంగ్ పంచాయతీ కార్యాలయంలో గంజాయి సాగుకు వ్యతిరేకంగా ఆదివాసీలకు సచేతన శిబిరం ఏర్పాటు చేశారు. గంజాయి సాగు చేస్తే ఏజెన్సీలో మానుకుని ఇతర అంతర, వాణిజ్య పంటలు పండిస్తే అందుకు తగు సహకారం అందిస్తానని ఎస్‌డీపీఓ రాకేష్ కుమార్ అన్నారు. ఈ శిబిరంలో వంద మంది గ్రామస్తులు పాల్గొన్నారు. ఆర్.ఉదయగిరి సబ్ డివిజన్ పోలీసు అధికారి రాకేష్‌కుమార్ సాహు, స్థానిక సర్పంచ్, పంచాయతీ రాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.


