నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

Aug 19 2026 12:30 AM | Updated on Aug 19 2026 12:30 AM

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో శాశ్వత నిత్యాన్నదాన పథకానికి నగరానికి చెందిన కంటుభుక్త చినసూర్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన భార్య సరోజిని, కుమారుడు శ్రీనివాస్‌లు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఆలయ ఈవో కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌కు విరాళం అందజేసి రశీదు పొందారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ తహశీల్దార్‌ పి.వి.శ్యామ్‌సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం

శ్రీకాకుళం కల్చరల్‌: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఏపీడబ్ల్యూజేఎఫ్‌ పనిచేస్తుందని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు అన్నారు. శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి వద్ద ఉన్న ప్రెస్‌క్లబ్‌లో సంఘ 7వ జిల్లా మహాసభ మంగళవారం నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా డి.ఆనంద్‌, ప్రధాన కార్యదర్శిగా టి.భీమారావు, ఉపాధ్యక్షులుగా డి.నందికేశ్వరరావు, జి.రామారావు, బి.సాయి, కోశాధికారిగా కె.శివశంకర్‌, సంయుక్త కార్యదర్శులుగా ఎస్‌.ఎస్‌.ప్రకాశరావు, ఎం.సుదర్శన్‌, పి.శోభన్‌, వై.రాముతో పాటు 15 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. జాతీయ కౌన్సిల్‌ సభ్యులుగా సత్తారు భాస్కరరావు, పేడాడ పరమేశ్వరరావు, కొంక్యాన వేణుగోపాల్‌, గరుకు లక్ష్మణరావు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుగా ఎస్‌.మురళి, కె.ప్రసాద్‌, ఎ.వి.రమణ, జి.భాస్కరరావు, కె.సుదర్శనరావు, బి.వాసుదేవరావు, ఎం.ప్రసాద్‌ ఐ.పోతన్నదొర, వెల్ఫేర్‌ కమిటీ కన్వీనర్‌గా సదాశివుని కృష్ణ, కో కన్వీనర్‌గా జి.మన్మథరావులను ఎన్నుకున్నారు. అనంతరం జాతీయస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా ఎంపికై న కె.జయశంకర్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎన్‌ఏజే కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జాతీయ కార్యవర్గ సభ్యులు సత్తారు భాస్కరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి.లక్ష్మణరావు, ఎస్‌.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.

సారా విక్రయదారుడికి జైలుశిక్ష

వజ్రపుకొత్తూరు రూరల్‌: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పెంటిభద్ర గ్రామానికి చెందిన సవర ఉమాపతికి సారా విక్రయించిన కేసులో ఏడాది జైలు శిక్ష, రూ. 2లక్షల జరిమానా విధిస్తూ పలాస జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి యూ.మాధురి మంగళవారం తీర్పు వెలువరించారు. పలాస ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులు చేస్తున్న తనిఖీలలో భాగంగా 2018 మే 21న ఉమాపతి సారా విక్రయిస్తూ పట్టుబడ్డాడు. అప్పట్లో విధుల్లో ఉన్న ఎక్సైజ్‌ సీఐ బి.మురళీధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సంబంధిత శాఖాధికారి కె.మల్లికార్జునరావు తెలిపారు.

విదేశాలకు పోస్టల్‌ పార్శిల్‌ సేవలు

హిరమండలం : పోస్టల్‌ శాఖ ద్వారా ఇతర దేశాలకు వస్తువులను పార్శిల్‌ సేవలు అందించనున్నట్లు పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వండాన హరిబాబు అన్నారు. మంగళవారం హిరమండలంలోని పలు తపాలా కార్యాలయాలను తనిఖీలు చేశారు. తినుబండారాలు, ఇతర వస్తువులు, గిరిజన ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో ఇతర దేశాలకు పంపేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయనతో పాటు శేషాద్రినాయుడు, జగదీష్‌, సిబ్బంది ఉన్నారు.

సచివాలయంలో చోరీ

రణస్థలం: పిసిని గ్రామ సచివాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి పలు వస్తువులు పట్టుకుని వెళ్లిపోయినట్లు పంచాయతీ కార్యదర్శి లండ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళం బద్దలుకొట్టి రెండు యూపీఎస్‌లు , సీపీయూ, కీబోర్డు, మానిటర్‌, వెబ్‌ కెమెరా, హెడ్‌ ఫోన్స్‌, ప్రింటర్‌, టీవీ వంటివి దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సచివాలయాన్ని క్లూస్‌ టీం సభ్యులు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జె.ఆర్‌.పురం ఎస్సై వి.సత్యనారాయణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement