● కూంబింగ్‌కు వెళ్లి వస్తుండగా పోలీసులకు తారసపడిన భారీ డంప్
● మల్కన్‌గిరి జిల్లాలో బయటపడిన వైనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ వెలుగుచూసింది. కిటిమిటి, కటువాపధర్ గ్రామాల అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున జిల్లా పోలీసులు, బీఎస్‌ఎఫ్ జవాన్లు సంయుక్త కూంబింగ్ నిర్వహించి వస్తుండగా డంప్ తారసపడింది. దాన్ని తవ్వితీయగా అందులో ఉన్న వివిధ సామగ్రి ఆధారంగా మావోయిస్టులకు చెందినవిగా గుర్తించి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దీనిపై జిల్లా ఎస్పీ వినోధ్ పటెల్ అధ్యక్షతన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్‌లో లభ్యమైన సామగ్రిని ప్రవేశపేట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసులు, బీఎస్‌ఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులను పూర్తిగా తరిమికొట్టామన్నారు. సోమవారం కూంబింగ్‌కు వెళ్లి మంగళవారం తిరిగి పోలీసులు, జవాన్లు వస్తుండగా డంప్‌ను గుర్తించినట్టు పేర్కొన్నారు. దీన్ని వెలికితీయగా.. అందులో 32 రకాల సామగ్రి మావోయిస్టులకు చెందిన సామగ్రి ఉందన్నారు. వీటిలో తుపాకీలు, సీలెన్ బాటిళ్లు, జిలిటెన్ వైర్లు, కరెంట్ వైర్లు, బూలెట్లు, టిఫిన్ బాంబులు, మెడికల్ సామగ్రి, వాకీటాక్, మావో దుస్తులు, సోలార్ ప్లెట్లు, మావో సాహిత్యం ఉందని ఎస్పీ వివరించారు.


