జయపురం: జయపురం మున్సిపాలిటీ పరిధి జయనగర్ ప్రాంతం పాయిక వీధి సరస్వతీ బాలమందిరం ఉపాధ్యాయులకు పాఠశాల వార్షిక విద్యా ఆధారిక వర్క్‌షాపును మంగళవారం ప్రారంభించారు. బాల మందిరం అధ్యక్షులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహక కమిటీ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ప్రారంభమైన ఈ వర్క్‌షాపు 10 రోజులు నిర్వహిస్తారని నిర్వాహకులు వెల్లడించారు. ప్రారంభం కార్యక్రమంలో మానసిక వైద్యుడు ఎన్.సుధాకర్ పాల్గొని విద్యార్థుల మానసిక పరిప్థితిపై వివరించారు. చెప్పటం, వినటం, గుర్తించటంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమలో చిత్ర కళాకారులు నృశింగ షొడంగి, పద్మనాభ చౌదరి చిత్ర కళ, బొమ్మలు వేయటం, కాగితపు బొమ్మలు తయారు చేయటం, చేతి కళా నైపుణ్యాలపై వివరించి, పలు కళాత్మక వస్తువులు చేసి చూపించారు. సంస్థ కార్యదర్శి నిరంజన్ పాణిగ్రహి, ప్రిన్సిపాల్ రీతాలి సాహు, ఆకాశవాణి విశ్రాంత అధికారి ఉదయశంకర్ జానీ, పాఠశాల కమిటీ అధ్యక్షుడు అనూప్ కుమార్ సామంతరాయ్, సి.ఆర్.సిి విజయలక్ష్మీ పాణిగ్రహి, తదితరులు పాల్గొన్నారు.


