వామపక్షాల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

వామపక్షాల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు

Jun 10 2026 12:55 AM | Updated on Jun 10 2026 12:55 AM

పలాస: పెరిగిన ధరలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు మంగళవారం నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని కాశీబుగ్గ పోలీసలు అడ్డుకున్నారు. పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, లిబరేషన్‌ పార్టీల నాయకులు కాశీబుగ్గ రామాలయం నుంచి కాశీబుగ్గ బస్టాండ్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ రాస్తారోకో నిర్వహించడానికి ప్రయ త్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వామపక్ష పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. రాస్తారోకో చేయకుండా పోలీసులు నాయకులను అక్కడ నుంచి పంపించేశారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కె.మోహనరావు, ఎన్‌.గణపతి, లండ వెంకటరమణ, టి.సన్యాసిరావు, మద్దిల రామారావు, వంకల మాధవరావు, మద్దిల వినోద్‌, కె.రమేష్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement