జయపురం: గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ చైతన్య సారస్వత్ పరిషత్, శ్రీశ్రీ కళా వేదిక సంయుక్తంగా విజయవాడ వెలుగుబంద సమీపంలో గల గోదావరి గ్లోబల్ వర్సిటీ ప్రాంగణంలో గత శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహిత్య మహా సభల్లో జయపురం తెలుగు కవి సింహాద్రి శ్రీనివాసరావు, సుజాత దంపతులను సన్మానించారు. ఒడిశాలో తెలుగు భాష, సాహిత్యాల పరిరక్షణకు శ్రీనివాసరావు అందిస్తున్న సేవలను నిర్వాహకులు కొనియాడారు. వర్సిటీ చాన్స్‌లర్ కె.వి.వి.సత్యనారాయణ రాజు (చైతన్య రాజు), శ్రీశ్రీ కళావేదిక సీఈఓ కత్తిమండ ప్రతాప్, ఏపీ రక్షక విభాగ కమాండెంట్ కొండా నరసింహా రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శ్రీపొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ప్రముఖ తెలుగు సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


