పొందూరు: రైలు ఢీకొని చేనేత కార్మికుడు దుర్మణం చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలం తండ్యాం పంచాయతీ శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన కాకర్ల ఆనంద్(62) చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తాను నేసిన వస్త్రాలను ఆమదాలవలసలో మాస్టర్ వీవర్‌కు ఇచ్చేందుకు సోమవారం మధ్యాహ్నం వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత ఆమదాలవలస నుంచి రైలులో పొందూరు చేరుకున్నాడు. పొందూరు రైల్వే ప్లాట్‌ఫాంపై దిగి పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో గూడ్స్ రైలు కదలడంతో రాడ్డు తగిలి పట్టాలపై పడిపోయాడు. రైలు ఆనంద్ మెడ పైనుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆనంద్‌కు భార్య నాగరత్నం, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.


