రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల పరిశీలన

Jun 10 2026 12:55 AM | Updated on Jun 10 2026 12:55 AM

భువనేశ్వర్‌: స్థానిక రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న పునరాభివృద్ధి పనులను కేంద్ర న్యాయ, న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మంగళవారం పరిశీలించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో, అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌ను ఆధునిక, ప్రపంచ స్థాయి స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయపడి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందన్నారు.

నిబంధనల మేరకు హై కోర్టు బెంచ్‌ ఏర్పాటు

దీర్ఘ కాలంగా ఊగిసలాడుతున్న పశ్చిమ ఒడిశా శాశ్వత హై కోర్టు బెంచ్‌ ఏర్పాటుపై కేంద్ర న్యాయ, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ స్పందించారు. శాశ్వత హై కోర్టు బెంచ్‌ ఏర్పాటుకు హైకోర్టు, ముఖ్యమంత్రి ఆమోదం అవసరమని, ఈ ఆమోదం కోసం గవర్నర్‌ దరఖాస్తు చేస్తారని, దీన్ని పరిగణనలోకి తీసుకోవడం ఒక చట్టపరమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement