మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో గత మూడు నెలలుగా వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్‌లు అందడం లేదని కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టాయి. ఎన్నికల సమయంలో బీజేపీ తమ ఎన్నికల మ్యానిపెస్టోలో నెలకు రూ.3000 పింఛన్‌తోపాటు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు.
ఇప్పటివరకు ఉచిత విద్యుత్‌ను అందించలేదన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి పింఛన్లు కూడా అందించకపోవడం అన్యాయమన్నారు. 40 డిగ్రీలకు పైగా ఎండలు మండుతున్న పరిస్థితుల్లో కూడా పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌రావు ప్రజల పక్షాన నిలబడి జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించారు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సభ్యులు పి.కేశురావు, శ్రీనివాస్‌పాత్రో, తదితరులు పాల్గొన్నారు.


