రూ. 5 లక్షల జరిమానా
రాయగడ: ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను బిసంకటక్‌లో అధికారులు సీజ్ చేయడంతోపాటు ఐదు లక్షల రూపాయల జరీమానా విధించారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన జిల్లా యంత్రాంగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బిసంకటక్ తహసీల్దార్ కె.వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఐదుగురు బృందం బిసంకటక్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా సోమవారం దాడులు నిర్వహించారు. దాడుల్లో మూడు ఇసుక ట్రాక్టర్లతో పాటు మరో ఇటుకల ట్రాక్టర్‌ను అధికారులు గుర్తించి వాటికి సంబంధించి అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు జరీమానా విధించారు.
పశువులను తరలిస్తున్న లారీల పట్టివేత
సోంపేట: పశువులను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని బారువ ఎస్సై హరిబాబునాయుడు అన్నారు. కొర్లాం జంక్షన్ వద్ద పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు లారీలను పట్టుకున్నట్లు బుధవారం తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. పశువులను పరిమితికి మించి రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.


