చిత్రకొండ సమితిలో ట్రెక్కింగ్‌ మార్గం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

చిత్రకొండ సమితిలో ట్రెక్కింగ్‌ మార్గం ప్రారంభం

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితిలోని జలాశయం సమీపం నుంచి దోరఘట్‌ గ్రామం వరకు నాలుగు కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్‌ మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని జిల్లా కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వవింద్‌ రాజశిర్కే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులకు ఏంతో ఆనందాన్ని ఇస్తుంటాయన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా అందరి లక్ష్యం కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమవంతకు కృషి చేస్తామన్నారు. ఈకో టూరిజం కోసం ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్‌ పటెల్‌, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాఖా సిబ్బంది

Advertisement
 
Advertisement
Advertisement