పర్లాకిమిడి: జగన్నాథ రథయాత్ర సమీపిస్తున్నందున పర్లాకిమిడిలో రథాల తయారీకి శిల్పులు రథచక్రాలు, ఇరుసులు మరమ్మతులు జరుపుతున్నారు. పూరీ రథయాత్ర తర్వాత అత్యంత ఆడంబరంగా జరుగుతున్న పర్లాకిమిడి జగన్నాథ రథయాత్రకు బలభధ్ర, జగన్నాథ, సుభద్ర రథాలను తయారుచేసి మూడు మూర్తులను యాత్రకు వినియోగిస్తారు. మూడు రథాలు తయారుచేయడానికి కనీసం నెలరోజులు పడుతుందని శిల్పి అశోక్ మహారాణా తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఆషాఢ మాసం అధికమాసం కావడం వల్ల జూలై 16 న జగన్నాథ రథయాత్ర ఒడిషాలో జరగనుంది.
పర్లాకిమిడి రాజవీధిలో రథాల తయారీకి ఇరుసులు రథాల కలపను బయటకు తీసిన శిల్పులు


