బ్యారేజీలో మునిగి యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

బ్యారేజీలో మునిగి యువకుడు మృతి

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

మల్కన్‌గిరి: బ్యారేజీలో స్నానానికి దిగిన యువకుడు నీటిమునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిలా కోరుకొండ సమితి సోమనాథ్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని ఎం.వి.36 గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన అనూప్‌ ధర్‌ (18) స్థానికంగా ఉన్న బ్యారేజ్‌ వద్ద జరిగిన విందుకు స్థానికులతో కలిసి హాజరయ్యాడు. అనంతరం స్నానం కోసం బ్యారేజీలో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. అయితే స్నానం కోసం దిగిన అనూప్‌ ధర్‌ ఎప్పటికీ బయటకు రాకపోవడంతో అతనితో వెళ్లిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు బలిమెల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐఐసీ దీరాన్‌ పట్నాయక్‌ అదేశాలతో ఎస్సై సంజిత్‌ కుమార్‌ టక్రితో కూడిన బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బ్యారేజీలో గాలించగా రాళ్ల మధ్యలో అనూప్‌ ధర్‌ ఇరుక్కుపోయి చనిపోయి ఉండానికి గుర్తించి బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం కోసం మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement