జలుమూరు: శ్రీముఖలింగం కరకట్టపై సుమారు రూ.80 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర పనులపై లోకాయుక్త సోమవారం విచారణ చేపట్టింది. గ్రామానికి చెందిన అర్చకుడు, సామాజిక కార్యకర్త నాయుడు గారి రాజశేఖర్ ఈ ఏడాది జనవరిలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ పనులపై అధికారులు ఎంక్వయిరీ చేసిన నివేదికలో కూటమి నాయకులకు అనుకూలంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ గోవిందరావులు తుది విచారణ చేశారు. కరక ట్ట నిబంధనలకు విరుద్ధగా తవ్వకాలు, సీసీరోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, రోడ్డు మద్యలో విద్యుత్ స్తంభాలు పెట్టడం తదితర అంశా లు నమోదు చేశారు. ఇంతలో మాజీ సర్పంచ్ తది తరులు రాజశేఖర్‌తో వాగ్వాదానికి దిగగా వారిని మందలించారు. పూర్తి స్థాయి విచారణకు అన్ని డాక్యుమెంట్లతో కర్నూలు రావాలని ఆదేశించినట్లు రాజశేఖర్ తెలిపారు.


