గెడ్డలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గెడ్డలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

సంతబొమ్మాళి: నౌపడ పంచాయతీ సీతానగరం ముసళ్లఖానా గెడ్డలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి సోమవారం మృతి చెందాడు. ఎండ తీవ్రతకు రాత్రి పూట గెడ్డలో స్నానానికి దిగి చనిపోయి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఉదయం నీటిపై మృతదేహం తేలి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీఆర్వో జోగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నౌపడ ఎస్సై జి.నారాయణస్వామి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మతిస్థిమితం లేని వ్యక్తి మృతదేహం

Advertisement
 
Advertisement
Advertisement