సంతోష్‌ నేత్రాలు సజీవం | - | Sakshi
Sakshi News home page

సంతోష్‌ నేత్రాలు సజీవం

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

శ్రీకాకుళం కల్చరల్‌: పలాసకు చెందిన బోయిన సంతోష్‌కుమార్‌ (43) శ్రీకాకుళం రిమ్స్‌లో మర ణించగా ఆయన నేత్రాల ను కుటుంబ సభ్యులు దా నం చేశారు. ముందుగా పలాస శ్రీ సత్యసాయి సేవ సమితి ప్రతినిధి శ్రీనివాసరావు శ్రీకాకుళంలోని కళ్యాణ్‌ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రా న్ని సంప్రదించారు. రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు సూచనతో టెక్నీషియన్లు కార్నియా సేకరించి విశాఖలోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌కు తరలించారు.

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికారు్‌డ్స్‌లో చిరంజీవి

ఆమదాలవలస: పట్టణంలోని మెట్టక్కివలసలో కుప్పిలివారి వీధికి చెందిన రీసు చిరంజీవి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌లో చోటుదక్కించుకున్నాడు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా నిర్వహించిన దండి మార్చ్‌ 2.0 కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్‌పై అవగాహన కల్పించడంలో ఉత్తమ సేవలు అందించినందుకు ఈ అవార్డు లభించింది. విజయవాడలోని కేబీఎన్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నట్లు చిరంజీవి సోమవారం పేర్కొన్నారు.

వీఆర్‌ఓపై దాడి అమానుషం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: విధి నిర్వహణలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారిపై దాడి అమానుషమని ఏపీ జేఏసీ అమరావతి శ్రీకాకుళం శాఖ, శ్రీకాకుళం జిల్లా శాఖతో పాటు అనుబంధ సంఘాల సభ్యులు ఖండించారు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామ రెవెన్యూ అధికారి పి.రవికుమార్‌ సచివాలయంలో విధి నిర్వహణలో ఉండగా కొత్తకోట విష్ణు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డం అసాంఘిక చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు జిల్లా చైర్మన్‌, ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా అధ్యక్షులు బి.వి.వి.ఎన్‌.రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి.రమణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కె.ప్రవల్లిక ప్రియ, జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ ప్రకటన విడుదల చేశారు.

‘పుస్తకాల బాధ్యత

ఎంఈఓలదే’

శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేయాల్సిన పాఠ్య పుస్తకాలు, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కిట్లు మండల కేంద్రం నుంచి పాఠశాలలకు తరలించే బాధ్యత ఎంఈఓలదేనని, కానీ కొన్ని మండలాల్లో హెచ్‌ఎంలను ఇబ్బందులకు గురి చేస్తుండటం తగదని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశా రు. ఈ విషయమై ఇప్పటికే డీఈఓతో మాట్లా డామని, అవసరమైతే రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement