విద్యార్థులతో ఓటు బ్యాంకు రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో ఓటు బ్యాంకు రాజకీయాలు

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను విధ్వంసం చేస్తూ, విద్యార్థులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుని వదిలేశారని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం మండిపడ్డారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కావాల్సిన వనరులు ఏర్పాటు చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ విద్యార్థులను శాసీ్త్రయ విజ్ఞానానికి దూరం చేస్తున్నారని మండిపడ్డాన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) జిల్లా జనరల్‌ బాడీ సమావేశం జిల్లా కేంద్రంలోని దాసరి క్రాంతిభన్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య కుటుంబాలపై ఫీజుల భారం అధికమవుతోందన్నారు. విద్యార్థులు నిలువునా మోసం చేస్తూ పరీక్ష పత్రాలను కూడా లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సూపర్‌ సిక్స్‌ అన్న విజన్‌ చంద్రబాబు పథకాలు ఎక్కడా విద్యార్థులకు అందడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలను బద్దలు కొడుతూ విద్యావ్యవస్థపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ సమరశీల పోరాటాలకు సమాయత్తమవుతుందన్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమశేఖర్‌, రవి, జిల్లా ఉపాధ్యక్షులు సాయి, కార్తీక్‌, కౌశిక్‌ జిల్లా సహాయ కార్యదర్శులు వేణు, జయ, ప్రశాంత్‌, హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement