శ్రీకాకుళం పాతబస్టాండ్: మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు, విద్యార్థులకు నష్టదాయకమైన కేంద్రీకత వంటశాలలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేయాలని, వంట కార్మికుల వేతనాలు పెంచాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా బడి పిల్లల మెనూ చార్జీలు పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మధ్యా హ్న భోజన పథకం వంట కార్మికుల యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తర డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్లు రద్దు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వంట కార్మికుల యూనియన్, సీఐటీయే ఆధ్వర్యంలో సోమవా రం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పథకం నిర్వహణను స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రయివేట్ సంస్థలకు ఇవ్వాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవా లని డిమాండ్ చేశారు. ఇప్పటికే గార, శ్రీకాకుళం, ఆమదాలవలస మండలాల్లో వేడి ఆహారాన్ని అందించడంలో విఫలమయ్యారని చెప్పారు. తాజాగా జిల్లాలో 20 మండలాల్లో స్మార్ట్‌కిచెన్లు పెట్టాలని భూ సమీకరణ చేసే ప్రయత్నం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి. ప్రవీణ, వి.లక్ష్మీ, కౌసల్య, ఉమ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


