డాక్టరేట్‌ ప్రదానం | - | Sakshi
Sakshi News home page

డాక్టరేట్‌ ప్రదానం

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

సిద్ధా క్రాంతికుమార్‌కు

రాయగడ: సమాజ సేవ, రక్తదాన చైతన్యం, నిరుపేదలకు అండగా నిలుస్తు విశేష సేవలందిస్తున్న తాసుబెల్లి ఫౌండేషన్‌ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు, రాయగడ సమితి జేకేపూర్‌లో నివసిస్తున్న సిద్ధాక్రాంతి కుమార్‌కు గౌరవ డాక్టరేట్‌ లభించింది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన డే స్ప్రింగ్‌ థియాలాజీ విశ్వవిద్యాలయం ఆయన సేవలను గుర్తించి ఈ అరుదైన గౌరవాన్ని ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్రం హైదారాబాద్‌లొని గన్‌ ఫౌండ్రీ సూర్యలాక్‌ కాంప్లెక్స్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.వి.ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిద్ధా క్రాంతికుమార్‌కు గౌరవ డాక్టరేట్‌ అందజేశారు. తాసుబెల్లి ఫౌండేషన్‌ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రాంతికుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించడం, రక్తదానంపై అవగాహన కల్పించడం, ఆకలితో బాధపడుతున్న వారికి అన్నదానం, వస్త్రదానం, నిరుపేదల కుటుంబాలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడం వంటి అనేక సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ శంకర్‌ నాయుడు, సినీనటుడు ఘర్షణ శ్రీనివాస్‌, సినీ దర్శకుడు దమ్ములపాటి శ్రీనివాస్‌, సినీనటుడు, నిర్మాత అనిరాజ్‌ రాజశేఖర్‌ హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement