రాయగడలో బైక్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

రాయగడలో బైక్‌ ర్యాలీ

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

రాయగడ: పట్టణంలో ఆదివారం నాడు స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు. సర్‌–2026 కార్యక్రమాన్ని విజయవంతంగా, సమగ్రంగా అమలు చేయాలనే లక్ష్యంతో కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి ఆదేశానుసారం సబ్‌ కలెక్టర్‌ రమేష్‌ కుమార్‌ జెన్న నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. బూత్‌ లెవెల్‌ అధికారులు(బిఎల్‌ఒ) ఇంటింటా సర్వే సమయంలో ప్రజలు సహకరించాలని, తమతో పాటు అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు జాబితాతో సక్రమంగా నమోదయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. అలాగే ఓటర్లు వెబ్‌ సైట్‌తో పాటు ఓటరు హెల్ప్‌లైన్‌, యాప్‌ ద్వారా కూడా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ర్యాలీలో నినాదాలు చేశారు. ర్యాలీలొ బీడీఓ సుజిత్‌ కుమార్‌ మిశ్రా, జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి మానూయోలా ప్రియదర్శిని, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్‌ కుమార్‌, జిల్లా సహాయ ఎన్నికల అధికారి బిచిత్ర సేఠి, డిప్యూటీ కలక్టర్‌లు సిద్దార్ధ ఆనంద్‌ పండ, రుపాలి పాత్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement