సేవా రంగంలో విశేష కృషికి సత్కారం | - | Sakshi
Sakshi News home page

సేవా రంగంలో విశేష కృషికి సత్కారం

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

మల్కన్‌గిరి: భువనేశ్వర్‌లో శనివారం నిర్వహించిన ‘భారత్‌ భాగ్య విధాత’ హిందీ చిత్ర ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా మల్కన్‌గిరి జిల్లాకు చెందిన ఇద్దరు ఆరోగ్య శాఖ ఉద్యోగులు సత్కారం పొందారు. గిరిజన ప్రాబల్యం ఉన్న మల్కన్‌గిరి జిల్లాలో ఆరోగ్య సేవలు రంగంలో విశేష సేవలు అందినందుకు జిల్లా ప్రధాన ఆస్పత్రి మెట్రన్‌ సంయుక్తా సేఠికు, శిఖపల్లి ఆయుష్మన్‌ ఆరోగ్య మందిరం కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ స్వర్ణప్రభా రామ్‌ ఎంపికయ్యారు. భువనేశ్వర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం మోహన్‌ మాఝి, నటి కంగనా రనౌత్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement