పర్లాకిమిడి: సైకిల్ తొక్కితే మెరుగైన ఆరోగ్యం సాధ్యమని జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా అన్నారు. ప్రపంచ బైసైకిల్ దినోత్సవం సందర్భంగా స్థానిక బెత్తగుడ ఆర్మ్‌డ్ పోలీసు బెటాలియన్ కార్యాలయం గ్రౌండ్స్ నుంచి ‘ఫిట్ ఇండియా కాంపైన్’లో సైకిల్ ర్యాలీని ఆదివారం ప్రారంభించారు. ర్యాలీలో ఎస్పీ మీనా సైకిల్ తొక్కుతూ గజపతి స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సైకిల్ తక్కడం అలవర్చుకోవాలన్నారు. సైకిల్ తొక్కడం వల్ల ఫిట్‌నెస్ వస్తుందని, ఎటువంటి రోగాలు దరిచేరవని చెప్పారు.


