చాలని ఎన్సీఈఆర్టీతో చెప్పించడం పట్ల ఉపాధ్యాయ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖ లోని జూనియర్ లెక్చరర్లకు గానీ, లెక్చరర్లకు గానీ, ప్రొఫెసర్లకు కానీ టెట్ అవసరం లేదు. పీజీ పూర్తి చేసిన వారు జూనియర్ లెక్చరర్, లెక్చరర్‌లకు నిర్వహించే అర్హత పరీక్షలో విజయం సాధిస్తే వారు ఆ పోస్టుకు ఎంపికై నట్లే. విద్యాశాఖ మినహా మిగిలిన ఏ స్థాయి పోస్టుకై నా కేవలం అర్హత పరీక్షలో మాత్రమే విజయం సాధించాల్సి ఉంటుంది తప్ప మరో అర్హత పరీక్ష ెటెట్ తరహాలో ఉండదు. అటువంటిది కేవలం విద్యాశాఖలోని ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ తప్పనిసరి చేశారు.
ఇంటికి సాగనంపేందుకే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరోక్ష చర్యలు
కోర్టు తీర్పుపై ఉపాధ్యాయుల నిర్వేదం
ఏ శాఖకూ లేని నిబంధన విద్యాశాఖకే ఎందుకని ఆవేదన


