శ్రీకాకుళం న్యూకాలనీ: తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణతోపాటు శారీరక దారుఢ్యం మెరుగవుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కల్యాణ మండపం వేదికగా సమ్మర్ తైక్వాండో లీగ్–2026 పేరిట పోటీలు నిర్వహించారు. సబ్ జూనియర్స్, క్యాడిట్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజేతలైన బాలబాలికలకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా పతకాలు, ట్రోఫీలు అందజేశారు. క్రీడాకారులకు ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న తైక్వాండో శ్రీను, శిష్యబృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, వైఎస్సార్ సీపీ నాయకులు శిమ్మ రాజశేఖర్, మండవెల్లి రవి, ఊన్న నాగరాజు, దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంఠ వేణు, ఏపీ ఎన్‌జీవోస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మెట్ట నాగరాజు, సీనియర్ న్యాయవాది నౌపాడ విజయకుమార్, జర్నలిస్టులు సుధీర్ వర్మ, గిడుతూరి వెంకటేశ్వరరావు, జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలబద్రుని రాజా, సహారా కృష్ణ, తైక్వాండో అసోసియేషన్ సభ్యులు వైశ్యరాజు మోహన్, బెవర జ్యోతి, ఏపీ తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను, న్యాయనిర్ణేతలు మజ్జి గౌతమ్, పి.నవీన్, ఎన్.రవి, వి.జాస్మిన్, గణసాయి, సాయిబాలాజీ, ఉదయ్ శంకర్, జోషిని, డి. భవాని, ఎన్.శేఖర్ (టెక్కలి కోచ్), హరి, నాగమణి పాల్గొన్నారు.


