రైలు ఢీకొని యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని యువకుడు మృతి

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

సోంపేట: జింకిభద్ర గ్రామానికి చెందిన తెలుకుల తేజేశ్వరరావు(35) పలాసపురం గ్రామ సమీపంలో రైల్వేట్రాక్‌ వద్ద గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జింకిభద్ర గ్రామానికి చెందిన తెలుకుల చూడామణి కుమారుడు తేజేశ్వరరావుకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంతలో శనివారం రాత్రి గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తేజేశ్వరరావు మృతి చెందాడు. పలాస రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కవిటి: కొరికానపుట్టుగ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యపుట్టుగ గ్రామానికి చెందిన బైరెడ్ల ధర్మరాజు మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన మెండ యుగంధర్‌, బైరెడ్ల చరణ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యపుట్టుగకు చెందిన యుగంధర్‌, చరణ్‌, ధర్మరాజు ద్విచక్ర వాహనంపై కవిటికి పనుల నిమిత్తం వెల్లారు. పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో కొరికాన పుట్టుగ సమీపంలో బండి అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న సిమెంట్‌ పోల్‌ను బలంగా ఢీకొట్టింది. బైక్‌ వెనక కూర్చున్న ధర్మరాజు మృతి చెందగా.. చరణ్‌, యుగంధర్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం బరంపురం తరలించారు. కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement