హత్యతో మరో ఇద్దరికి సంబంధం..? | - | Sakshi
Sakshi News home page

హత్యతో మరో ఇద్దరికి సంబంధం..?

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

హత్యతో మరో ఇద్దరికి సంబంధం..? ● కుమారుడు, అల్లునిపై అనుమానాలతో అదుపులోకి తీసుకున్న పోలీసులు

● కుమారుడు, అల్లునిపై అనుమానాలతో అదుపులోకి తీసుకున్న పోలీసులు

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలో గురువారం అర్ధరాత్రి గాజులవీధి ప్రకాష్‌ నగర్‌లో భర్త ధర్మాన అసిరినాయుడుని భార్య జయలక్ష్మి అంతమొందించిన సంగతి విధితమే. అయితే ఈ హత్యకేసుకు సంబంధించి పోలీసుల విచారణ చేయగా అనేక విషయా లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యతో మరో ఇద్దరికి సంబంధమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మూడు ప్రయత్నాలతో హత్య..?

పోలీసులు ఈ కేసుకు సంబంధించి కీలక సాంకేతిక ఆధారాలు శనివారం సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినప్పుడు కొన్ని ఆధారాలు లభించాయి. కత్తిపీట గాట్లు పెట్టే ముందే విషమిచ్చి చంపేందుకు య త్నించారని, మెడను తాడుతో నులిమినట్లు ఆధారాలుండటం గుర్తించారని సమాచారం. ఈ దిశగా పోలీసులు జయలక్ష్మిని ఇంటరాగేట్‌ చేసినట్లు, ఆమె మరో ఇద్దరికి సంబంధాలున్నట్లు తెలపడంతోనే మొత్తం తీగ లాగారు.

కొడుకు, అల్లునిపైనే.. ?

హత్యకు గురైన అసిరినాయుడు నిత్యం భార్యను మద్యం మత్తుతో వేధించడం, ఇంటికొచ్చి భార్య వద్ద డబ్బులు గుంజేయడం లేదంటే చితకబాదేయ డం చేస్తుండేవాడు. కుమారుడు, అల్లునితో బాధ ను పంచుకుని వారితోనే ఈ హత్యకు పన్నాగమేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి తగ్గట్టుగానే పోలీసులు అసిరినాయుడు కుమారుడు మణికంఠ, అల్లునికి ఫోన్లు చేసినా స్విచ్చాఫ్‌ కావడం, ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లడంతో గాలించారు. శనివారం రాత్రి పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే హత్యలో పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్న మృతుని కుమారుడు మణికంఠే తన తండ్రి హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement