పర్లాకిమిడి: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని వక్తలు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గుసాని సమితి కెరండీ పంచాయతీ శ్రీరామలింగేశ్వర మందిరం వద్ద జిల్లా న్యాయసేవాప్రాధికరణ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి ఆదేశాల మేరకు మొక్కలు నాటారు. అనంతరం మందిరం ఆవరణలో చెత్తను ఊడ్చి, పిచ్చిమొక్కలను తొలగించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి బిమల్ రవుళో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, బార్ సభ్యులు ఇతిశ్రీ మహాపాత్రో, సామాజిక కార్యకర్త మనోజ్ దాస్, అఖిల భారత యవ పరిషత్ గిన్ని కుమార్ రెడ్డి, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సునీతా రోథ్ తదితరులు పాల్గొన్నారు.
పిచ్చి మొక్కల తొలగింపు
పర్లాకిమిడి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా లీగల్ ఎయిడ్ ఆధ్వర్యంలో రామసాగరం వద్ద శ్రీరామలింగేశ్వర మందిరం ఆవల స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, అఖిల భారత యువజన సేవా సమితి కూర్మారెడ్డి ఆధ్వర్యంలో డ్రైనేజీలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో, బార్ అసోసియేషన్ సభ్యులు, ఏబీవైఎస్‌ఎస్ గిన్ని కూర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


