రైస్‌మిల్లుకు నష్టం | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లుకు నష్టం

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

కాల వైశాఖితో

పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడి, గుసాని సమితిల్లో శుక్రవారం కాలవైశాఖి ప్రభావంతో పిడుగులు, గాలివానతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ తీగలు తెగి దోనూరు గ్రామంలో రవాణా స్తంభించిపోయింది. గుసాని సమితి కంట్రగడ, బడగాం, పనెద్ద కొత్తూరు, దోనూరులో అనేక వృక్షాలు నేలకొరిగాయి. మచ్చమర గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఒక రైస్‌ మిల్లు గాలులకు పూర్తిగా నేలకొరగటంతో మిల్లు యజమాని జగదీష్‌కు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది. పెద్ద కొత్తూరు, చిన్నకొత్తూరు మధ్య గాలులు, వర్షాలకు విద్యుత్‌ తీగలు, స్తంభాలు నేలకొరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement