‘మ్యాపింగ్‌ వేగవంతం చేయండి’ | - | Sakshi
Sakshi News home page

‘మ్యాపింగ్‌ వేగవంతం చేయండి’

Jun 5 2026 1:00 AM | Updated on Jun 5 2026 1:00 AM

‘మ్యాపింగ్‌ వేగవంతం చేయండి’ అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి గొర్రెల మందపై కుక్కల దాడి బైక్‌ చోరీ విద్యుదాఘాతంతో మున్సిపల్‌ కార్మికుడికి గాయాలు ఈదురుగాలుల బీభత్సం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) – 2026 ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, క్షేత్రస్థాయి మ్యాపింగ్‌ పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, తహసీల్దార్లు, బీఎల్‌ఓలతో ప్రత్యేకంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ఆయన సర్‌ ప్రక్రియ ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,088 మంది బీఎల్‌ఓలలో అత్యధిక శాతం మంది మ్యాపింగ్‌ను సమర్థంగా పూర్తిచేశారని, మిగిలిన 60 మంది బీఎల్‌ఓలు కూడా తమ పరిధిలోని పనులను త్వరితగతిన పూర్తి చేసే లా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రాబోయే ఇంటింటి సర్వే ప్రారంభానికి ముందే సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించి, మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో పూర్తిచేయాలని కలెక్టర్‌ అధికారులను కోరారు.

ఎచ్చెర్ల: ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం గ్రామానికి చెందిన పి. రత్నకుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈమె భర్త, పిల్లలతో కలిసి విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ గత ఎనిమిదేళ్లుగా జీవనం సాగిస్తున్నా రు. వీరు బాటిల్స్‌ ఏరుకుంటూ జీవిస్తున్నారు. భర్త బయటకు వెళ్లి తిరిగి వచ్చి చూసినప్పటికి భార్య చనిపోయి ఉంది. పోలీసులకు వివరాలు తెలియపరచడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు.

జి.సిగడాం: పాలఖండ్యాం గ్రామానికి చెందిన డొప్ప అప్పన్నకు చెందిన గొర్రెల మందపై గురువారం వీధి కుక్కలు దాడి చేయడంతో 10 గొర్రెలు చనిపోయాయి. మరో ఆరు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గ్రామంలో ఉన్న సు మారుగా 20 కుక్కలు ఒకేసారి గొర్రెలపై దాడి చేశాయని బాధితుడు వాపోయారు. అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రణస్థలం: మండల కేంద్రంలోని జేఆర్‌ పురం పంచాయతీలో గల వెంకటేశ్వర కాలనీలో షేక్‌ సాజహన్‌ ద్విచక్ర వాహనం (గ్లామర్‌ బైక్‌) గుర్తు తెలియని వ్యక్తి బుధవారం తీసుకువెళ్లిపోయాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో అటూ ఇటూ చాలా సేపు తిరిగి ద్విచక్ర వాహ నం నడిపించుకుని వెళ్లిపోయాడు. ఈ దొంగత నం సమీపంలోని సీసీ పుటేజ్‌లో నమోదైంది. ఈ చోరీ గురువారం సోషల్‌ మీడియా ద్వారా బహిర్గతమైంది. దీనిపై జేఆర్‌ పురం పోలీసు లు ఇంకా కేసు నమోదు చేయలేదు.

పలాస: పలాస కాశీబుగ్గ ఔట్‌ సోర్సింగ్‌ విద్యుత్‌ కార్మికుడు బుధవారం సాయంత్రం విధులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. రాజమ్మకాలనీకి చెందిన విద్యుత్‌ కార్మికుడు నెయ్యిల గణపతి వీధి లైట్లు వెలిగించేందుకు వాటిని సరిచేసేందుకు విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. ఆ సమయంలో ఉరుములు మెరుపులు రావడంతో పాటు వర్షం పడటంతో ఆయన విద్యుదాఘాతానికి గురై స్తంభం నుంచి కిందకి జారిపడి గాయాలపాలయ్యాడు. అతడిని వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆ తర్వాత అక్కడి నుంచి టెక్కలి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్య సేవలు అందుతున్నాయి.

హిరమండలం : ఎల్‌ఎన్‌పేట, హిరమండలం మండలాల్లో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలి, భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు, విద్యు త్‌ స్తంభాలు నేలకొరిగాయి. భారీగా వీచిన గాలికి జనం భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో విద్యుత్‌ శాఖ సిబ్బంది హటాహుటిన స్పందించి సహాయక చర్యలు చేపట్టి రాత్రి సమయానికి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు.

Advertisement
 
Advertisement
Advertisement