వ్యసనాలకు అలవాటు పడి.. దొంగలుగా మారి | - | Sakshi
Sakshi News home page

వ్యసనాలకు అలవాటు పడి.. దొంగలుగా మారి

Jun 5 2026 1:00 AM | Updated on Jun 5 2026 1:00 AM

వ్యసనాలకు అలవాటు పడి.. దొంగలుగా మారి

మాస్క్‌లు ధరించి దొంగతనాలు చేస్తున్న యువకులు

నరసన్నపేట పోలీసులకు చిక్కిన

నిందితులు

నరసన్నపేట: ఉత్తరాంధ్రలో పలు చోరీ కేసుల్లో నిందితులైన విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన మండూరి సంతోష్‌ కుమార్‌, బూర అశోక్‌ ఎట్టకేల కు నరసన్నపేట పోలీసులకు చిక్కారు. సత్యవరం సర్వీసు రోడ్డుపై అనుమానాస్పదంగా ఉన్న వీరిని పోలీసులు పట్టుకుని తమదైన శైలిలో ఆరా తీయగా పలు కేసుల్లో నిందితులుగా తేలింది. వీరి నుంచి రూ.23.64 లక్షల విలువైన 157 గ్రాముల బంగారం ఆభరణాలు, ఒక బజాజ్‌ పల్సర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావులు నరసన్న పేట సర్కిల్‌ స్టేషన్‌లో గురువారం విలేకరుల కు వివరాలు వెల్లడించారు. ఈ ఇద్దరు యువకులు కార్పెంటర్‌ వృత్తి చేసుకుంటూ కాలం గడుపుతూ వ్యసనాలకు బానిసలుగా మారారు. కార్పెంటర్‌ వృత్తిలో అంతగా డబ్బులు రాకపోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నాల్లో భాగంగా దొంగతనాలకు పాల్పడ్డారు. ముఖానికి మాస్క్‌లు పెట్టుకొని రోడ్డుపై ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడ్డారని వివరించారు. వారిపై నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్‌, పోలాకి, రామభద్రపురం, పెందుర్తి, గోపాలపట్నం పోలీసు స్టేషన్లలో 7 చోట్ల చోరీలకు పాల్పడగా కేసులు నమోదయ్యాయని అన్నారు. వీరిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేయ డంలో కృషి చేసిన నరసన్నపేట ఎస్‌ఐ బలివాడ గణేష్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని అన్నారు. సమావేశంలో నరసన్న పేట సీఐ మరడాన శ్రీనివాసరావులతో పాటు పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement