కార్మికుల సమస్యలపై పోరాటం ఉద్ధృతం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యలపై పోరాటం ఉద్ధృతం

Jun 5 2026 1:00 AM | Updated on Jun 5 2026 1:00 AM

కార్మికుల సమస్యలపై పోరాటం ఉద్ధృతం

రణస్థలం: శ్యాంపిస్టన్స్‌ కార్మికుల సమస్యలు వెంట నే పరిష్కరించాలని లేకపోతే దశలవారీగా పోరాటం ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు హెచ్చరించారు. మండలంలోని వరి శాం గ్రామం వద్ద గల శ్యాంపిస్టన్స్‌ ప్లాంట్‌–2 పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పరిశ్రమ వద్ద శ్యాంపిస్టన్‌ యూనియన్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబ సభ్యుల 48 గంటల ధర్నా రెండో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి పలు సంఘాల నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్యాంపిస్టన్స్‌ యాజమాన్యం దుర్మార్గానికి నిరసనగా 600మంది కార్మికుల కుటుంబా లు 48 గంటల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. 58 ఏళ్ల వరకు కార్మికులకు సర్వీస్‌ ఉంటుండగానే 30 ఏళ్ల సర్వీస్‌ పూర్తయిందని 150 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి అర్ధంతరంగా తొలగించారని వి మర్శించారు. వారి కుటుంబాలు రోడ్డున పడి జీవనం కోల్పోయారని, పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే కా ర్మికులు ఏ విధంగా జీవించాలని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement