ఈశ్వర తలియకు ఘనంగా నివాళులు | - | Sakshi
Sakshi News home page

ఈశ్వర తలియకు ఘనంగా నివాళులు

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి ఖెందుగుడ గ్రామ పంచాయతీలో సహిద్‌ ఈశ్వర తలియ స్మారక ఉద్యాన వనంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేడు సహిద్‌ జవాన్‌ ఈశ్వర తలియ స్మారక కమిటీ తలియ స్మారక ఉద్యాన వనంలో గల ఆయన ప్రతిమకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఖెందుగుడ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ అభినాయిక్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈశ్వర తలియ సేవలు తెలియజేశారు. ఈశ్వర తలియ దేశ ప్రేమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అతడి త్యాగం కొరాపుట్‌ జిల్లాకు గర్వకారణమన్నారు. కార్యక్రమాన్ని సహిద్‌ జవాన్‌ ఈశ్వర్‌ తలియ స్మారక కమిటీ అధ్యక్షుడు న్యాయ వాది విశ్వజిత్‌ నాయిక్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సహిద్‌ ఈశ్వర తలియ కుటుంబ సభ్యులు, విశ్రాంత ఉపాధ్యాయుడు దివాకర లెంక, గ్రామ ప్రజలతో పాటు పంచాయతీలో పలు గ్రామాల నుండి ప్రజలు పాల్గొని సహిధ్‌ జవాన్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement
 
Advertisement
Advertisement